Header Banner

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం! కొత్త విధానాలు ఇవే!

  Thu Mar 06, 2025 14:13        Politics

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ చట్టాలు, నిబంధనల్లో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులు, సామాన్యులు ఎదుర్కొంటున్న అసైన్డ్‌ భూముల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని నిర్ణయించింది. దీనిపై దిశానిర్దేశం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు (జీఓ 464) జారీ చేశారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, పి.నారాయణ, టీజీ భరత్‌, ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూఖ్‌ సభ్యులుగా ఉన్నారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


కమిటీ అధ్యయనం చేసే అంశాలివీ..
అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలు, వాటి నియమ నిబంధనల్లో తీసుకురావాల్సిన మార్పులు, సవరణలు
రెవెన్యూ వ్యవస్థను మరింత సులభతరం చేయడం, ప్రజలకు చేరువ చేసేందుకు భూ పరిపాలనకు సంబంధించిన బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ (బీఎ్‌సవో), ఉత్తర్వుల (జీవో)పై అధ్యయనం.
వ్యవసాయ భూమి వినియోగ మార్పిడి, వన్‌ టైమ్‌ కన్వర్షన్స్‌ తదిత ర స్కీములను మరింత బలోపేతం చేయడానికి పురపాలక శాఖతో కలిసి సమగ్ర పాలసీని రూపొందించడం.
అసైన్డ్‌ భూముల చట్టం ప్రకారం భూములను ఫ్రీహోల్డ్‌ చేయడంలో పేద వర్గాల ప్రయోజనాలు కాపాడేలా కొత్త పాలసీని ఖరారు చేయడం.
రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22(ఏ) సెక్షన్‌ను అధ్యయనం చేసి అసైన్డ్‌, ఇతర కీలక భూముల విషయంలో తగిన పాలసీని సిఫారసు చేయాలి.
భూకేటాయింపు విధానం పక్కాగా అమలయ్యేలా తగిన జాగ్రత్తలు, సూచనలు చేయాలి. ఈ అంశాలపై ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ కోరారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #lands #assignedlands #todaynews #flashnews #latestnews